పామూరు అయ్యప్ప దేవస్థానంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం
డాక్టర్ గద్దె ఏడుకొండలు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ
ప్రతినిధి రజియా సయ్యద్
పామూరు, నవంబర్ 20 పున్నమి తెలుగు దినపత్రిక..
స్థానిక అయ్యప్ప స్వామి దేవస్థానంలో మాలధారణ భక్తుల కోసం ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లుగానే, ఈ సంవత్సరం కూడా ప్రముఖ వైద్యులు డాక్టర్ గద్దె ఏడుకొండలు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో భారీ అన్న దాన కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది.
శుక్రవారం ఉదయం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం అన్న ప్రసాద వితరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ గద్దె ఏడుకొండలు మాట్లాడుతూ.. ” అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న భక్తులకు అన్నదానం చేయడం మా కుటుంబం చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. స్వామి వారి కృపతో ప్రతి ఏటా ఈ సేవ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము ” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పామూరు మరియు పరిసర గ్రామాల నుండి విచ్చేసిన వందలాది మంది అయ్యప్ప మాలదారులు, భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. దేవస్థాన కమిటీ సభ్యులు, గురుస్వాములు డాక్టర్ గద్దె ఏడుకొండలు, కుటుంబ సభ్యులను శాలువాతో సత్కరించి,వారిసేవని రతినిఅభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు,కమిటీ సభ్యులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
