గడివేముల మండల పరిధిలోని గ్రామాలలో పశు వైద్యాధికారిణిలు డాక్టర్ సాయి హరణి,డాక్టర్ పావనిలు గడివేముల మరియు గడిగరేవుల గ్రామాలలోని పశువులకు వచ్చు ముద్ద చర్మ వ్యాధి మరియు గొంతువాపు నివారణ టీకాలను అందజేశారు.ఈ సందర్భంగా వారు పశు పోషకులతో మాట్లాడుతూ ముద్ద చర్మ వ్యాధి వైరస్ ద్వారా వ్యాపించే అంటువ్యాదని,వ్యాధి సోకిన పశువులకు అధిక జ్వరం వచ్చి, పశువుల శరీరంపై గడ్డలు (ముద్దలు) ఏర్పడతాయని,దోమలు,ఈగలు,నల్లుల ద్వారా ఒక పశువు నుంచి మరో పశువుకు సులభంగా వ్యాపిస్తుందని,దీనివల్ల పశువుల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా పాల ఉత్పత్తి తగ్గిపోతుందని,వ్యాధి సోకిన పశువులకు 105 డిగ్రీల వరకు జ్వరం వచ్చి,శరీరం,ముఖ్యంగా మెడ, పొదుగు,కాళ్లపై గట్టి ముద్దలు ఏర్పడతాయని,కళ్ళు,ముక్కు నుంచి నీరు కారడం,లాలాజలం ఎక్కువగా స్రవించడం జరుగుతుందని,ఇలాంటి లక్షణాలు పశుపోషకులు తమ పశువులకు కనిపించిన వెంటనే దోమలు,ఈగలు,నల్లులు కుట్టకుండా పశువుల శాలలను శుభ్రంగా ఉంచుకోని,వేప ఆకులు,పసుపు, వెల్లుల్లి మరియు తులసి ఆకులను నూరి కొబ్బరి నూనెలో కలిపి పుండ్లకు రాసి,ప్రభుత్వ పశువైద్యశాలను సంప్రదించి వ్యాధి సోకకుండా పశువులకు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని తెలిపిన అనంతరం పశువులకు వర్షాకాలంలో బ్యాక్టీరియా వల్ల సోకే గొంతు వాపు వ్యాధి లక్షణాలపై వివరిస్తూ గొంతు వాపు వ్యాధి వచ్చిన పశువులు 24-32 గంటల్లోనే మరణించే అవకాశం ఉందని,పశువులకు గొంతు,మెడ కింద భాగంలో వాపు వచ్చి 104 నుండి 107 డిగ్రీల వరకు తీవ్రమైన జ్వరం ఉంటుందని,శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఉండి,గురక,నోటి నుంచి నురగ రావడం వ్యాధి లక్షణలని,వర్షాకాలం ప్రారంభానికి ముందే పశువులకు ‘గొంతువాపు’ టీకాలు తప్పనిసరిగా వేయించాలని అవగాహన కల్పించారు.

పశువులకు ముద్ద చర్మ వ్యాధి,గొంతువాపు నివారణ టీకాలను అందజేసిన…..పశు వైద్యాధికారిణిలు.