Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు ::: చెముడుగుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లిదండ్రులు మృతి, కుమారుడికి గాయాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నెల్లూరు ::: చెముడుగుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లిదండ్రులు మృతి, కుమారుడికి గాయాలు

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు: ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వగ్రామానికి బయలుదేరిన కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం విషాదంలో ముంచింది.
  • నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంటలోని ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందగా, వారి కుమారుడు గాయపడ్డాడు.బెంగళూరు నుంచి కనిగిరికి ఓటు వేసేందుకు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
  • ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోయారు.

నెల్లూరు: ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వగ్రామానికి బయలుదేరిన కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం విషాదంలో ముంచింది. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంటలోని ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందగా, వారి కుమారుడు గాయపడ్డాడు.బెంగళూరు నుంచి కనిగిరికి ఓటు వేసేందుకు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన కుమారుడికి చికిత్స అందిస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఓటు వేసేందుకు బయలుదేరిన కుటుంబంలో చోటుచేసుకున్న ఈ విషాదం స్థానికంగా కలచివేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *