Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నిర్భయంగా నామినేషన్లు వేయండి: జిల్లా ఎస్పీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నిర్భయంగా నామినేషన్లు వేయండి: జిల్లా ఎస్పీ

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

నెల్లూరు జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లకు సుమారు 600 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నట్లు ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు. డ్రోన్లు, సీసీటీవీలు, చెక్‌పోస్టులతో నిఘా కొనసాగుతోందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకే కొందరు నాయకులను గృహనిర్బంధంలో ఉంచామని, రాజకీయ ఉద్దేశం లేదని పేర్కొన్నారు. అభ్యర్థులు నిర్భయంగా నామినేషన్లు దాఖలు చేయాలని సూచించారు. ఇబ్బందులుంటే డయల్‌ 112ను సంప్రదించాలని కోరారు. బెదిరింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని స్పష్టం చేశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు ప్రజలు, అభ్యర్థులు, రాజకీయ నాయకులు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *