డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ శాఖకు కేటాయించిన బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన ఆడ పోలీస్ డాగ్ ‘మాయ’ తన శిక్షణలో ప్రతిభ కనబరిచి నార్కోటిక్ ట్రేడ్లో సిల్వర్ మెడల్ సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా మాయ ఈ రోజు జిల్లాకు చేరుకుని ఎస్పీ శ్రీ రాహుల్ మీనా, ఐపీఎస్ గారికి గౌరవ వందనం చేసింది. మాయ సాధించిన విజయంపై ఎస్పీ శ్రీ రాహుల్ మీనా, ఐపీఎస్, DSWO/RI శ్రీ కోటేశ్వరరావు మాయతో పాటు ఆమె హ్యాండ్లర్లను అభినందించారు. నార్కోటిక్ పదార్థాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టడంలో శిక్షణ పొందిన పోలీస్ డాగ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని అధికారులు తెలిపారు. మాయ విజయం కోనసీమ జిల్లా పోలీస్ శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు.
