Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

నంద్యాలలో బీజేపీ సేవా జ్యోతి ర్యాలీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నంద్యాలలో బీజేపీ సేవా జ్యోతి ర్యాలీ

వార్త ముఖ్యాంశాలు

  • నంద్యాల -: శ్రీ నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా 25 సంవత్సరాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా నంద్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
  • జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించి మోదీ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై నాయకులు, కార్యకర్తలకు వివరించారు.అనంతరం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
  • నాయకులు, కార్యకర్తలతో కలిసి సేవా జ్యోతిని వెలిగించి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

నంద్యాల -: శ్రీ నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా 25 సంవత్సరాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా నంద్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించి మోదీ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై నాయకులు, కార్యకర్తలకు వివరించారు.అనంతరం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి సేవా జ్యోతిని వెలిగించి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీలోకి భారీగా చేరికలు
ఉయ్యాలవాడ, దొర్నిపాడు మండలాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అభ్యర్థుల ఎంపికపై కీలక చర్చ
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మున్సిపాలిటీల వారీగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు నాయకులతో చర్చించారు. పార్టీ బలోపేతం, ఎన్నికల వ్యూహం, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై కార్యవర్గ సభ్యులతో సమీక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *