Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం

వార్త ముఖ్యాంశాలు

  • జిల్లాలోని నెల్లూరు నగరపాలక సంస్థ, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీల్లో నవంబర్ 1న నిర్వహించనున్న ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు.
  • జిల్లాలో మొత్తం 128 వార్డులకు సంబంధించి 594 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
  • వీటి పరిధిలో 5,52,318 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

జిల్లాలోని నెల్లూరు నగరపాలక సంస్థ, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీల్లో నవంబర్ 1న నిర్వహించనున్న ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు.
జిల్లాలో మొత్తం 128 వార్డులకు సంబంధించి 594 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో 5,52,318 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 2,68,309 మంది పురుషులు, 2,83,921 మంది మహిళలు, 88 మంది ఇతర ఓటర్లు ఉన్నారు.
పోలింగ్ విధుల నిర్వహణకు 4,351 మంది సిబ్బందిని నియమించగా, ఎన్నికల భద్రత కోసం 1,725 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 52 అత్యంత సున్నిత, 200 సున్నిత, 342 సాధారణ పోలింగ్ కేంద్రాలను గుర్తించారు.
ఎన్నికల విధుల కోసం 115 వాహనాలను ఏర్పాటు చేయగా, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, అక్రమ నగదు, ప్రలోభాల నియంత్రణకు 50 నిఘా బృందాలను నియమించారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది, సర్వీస్ ఓటర్లు, ఇతర అర్హులకు మొత్తం 1,790 పోస్టల్ బ్యాలెట్లు జారీ చేశారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ, పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *