వార్త ముఖ్యాంశాలు
- --ఆత్మకూరులో కొప్పోలు సత్యవతి ఘన విజయం --ఆత్మకూరులో ఎగిరిన ఎర్రజెండా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రజా పోరాటాలకు పేరుగాంచిన సీపీఎం ఆత్మకూరులో బోణీ చేసింది.
- ఆత్మకూరు మున్సిపాలిటీలోని 21వ వార్డులో పోటీ చేసిన సీపీఎం అభ్యర్థి కొప్పోలు సత్యవతి విజయకేతనం ఎగురవేశారు.
- సీపీఎం ఆత్మకూరు పట్టణ కార్యదర్శి కొప్పోలు డేవిడ్ రాజు చేసిన ప్రజా పోరాటాలు, పట్టణ కమిటీ నాయకులు, కార్యకర్తల సమష్టి కృషికి ఈ విజయం నిదర్శనంగా నిలిచింది.
–ఆత్మకూరులో కొప్పోలు సత్యవతి ఘన విజయం
–ఆత్మకూరులో ఎగిరిన ఎర్రజెండా
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రజా పోరాటాలకు పేరుగాంచిన సీపీఎం ఆత్మకూరులో బోణీ చేసింది. ఆత్మకూరు మున్సిపాలిటీలోని 21వ వార్డులో పోటీ చేసిన సీపీఎం అభ్యర్థి కొప్పోలు సత్యవతి విజయకేతనం ఎగురవేశారు.
సీపీఎం ఆత్మకూరు పట్టణ కార్యదర్శి కొప్పోలు డేవిడ్ రాజు చేసిన ప్రజా పోరాటాలు, పట్టణ కమిటీ నాయకులు, కార్యకర్తల సమష్టి కృషికి ఈ విజయం నిదర్శనంగా నిలిచింది.
ఆత్మకూరు మున్సిపాలిటీలోని 21వ వార్డులో సీపీఎం అభ్యర్థి కొప్పోలు సత్యవతి విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఆత్మకూరులో ఎర్రజెండా ఎగరడంతో సీపీఎం నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్