మేడ్చల్ (కార్మికనగర్):
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవాహర్‌నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని కార్మికనగర్‌లో ఆదిపరాశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ దుర్గామాత దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగాయి.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, అలంకారాలు మరియు భజన కార్యక్రమాలు నిర్వహించారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని కాలనీవాసులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి దేవి కృపకు పాత్రులయ్యారు.
ఈ సందర్భంగా ఆదిపరాశక్తి యూత్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ… ప్రతీ ఏటా కాలనీవాసులందరి సహకారంతో దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని, అందరిపై ఆ దుర్గామాత ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. కాలనీవాసుల సమిష్టి భాగస్వామ్యంతో ఈ ఉత్సవాలు ఘన విజయం సాధించాయని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆదిపరాశక్తి యూత్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ పెద్దలు, మహిళలు మరియు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
విలేకరి: సందీప్ (పున్నమి రిపోర్టర్, మేడ్చల్ జిల్లా)

