Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జగనన్న కాలనీలో సొంత ఇంటి కల నెరవేరదెన్నడో… అసంపూర్తి గృహ నిర్మాణాలు పూర్తి చేయాలి.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జగనన్న కాలనీలో సొంత ఇంటి కల నెరవేరదెన్నడో… అసంపూర్తి గృహ నిర్మాణాలు పూర్తి చేయాలి.

పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి

బోగోలు మండలంలోని జగనన్న కాలనీలో అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలతో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంతో ఆశతో ప్రారంభించిన ఇళ్ల నిర్మాణాలు వివిధ కారణాలతో నిలిచిపోవడంతో సొంతింటిలో నివసించాలన్న వారి కల ఇంకా నెరవేరడం లేదు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హులైన లబ్ధిదారులకు నిబంధనల ప్రకారం సహాయం అందించి, నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కొత్త లబ్ధిదారులకు కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలి.
ఇప్పటికే మంజూరైన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడంతో పాటు, సొంత ఇల్లు, ఇంటి స్థలం లేని అర్హులైన పేద కుటుంబాలను కొత్తగా గుర్తించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన కొత్త లబ్ధిదారులకు కూడా ఇళ్ల స్థలాలు మంజూరు చేసి, వారి సొంతింటి కలను సాకారం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

జగనన్న కాలనీలో సొంత ఇంటి కల నెరవేరదెన్నడో… అసంపూర్తి గృహ నిర్మాణాలు పూర్తి చేయాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *