వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలంలో నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి ఘటన కలకలం రేపింది. ఎస్సై రాజేష్ రెడ్డి కథనం ప్రకారం.. ఆడుకుంటున్న చిన్నారిపై అదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలుడు మంగళవారం లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం చిన్నారి ఏడుస్తూ అమ్మమ్మకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు సమాచారం అందడంతో వారు విచారణ చేయబట్టి బాలుడు పై ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు.
