ఖమ్మం టూ టౌన్ పరిధిలోని 45వ డివిజన్లో బీజేపీ ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు వేల్పుల సుధాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణనాథుడిని బీజేపీ నాయకులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఖమ్మం టూ టౌన్ ప్రధాన కార్యదర్శి రుద్రగాని మాధవరావు, ఐటీ సెల్ కన్వీనర్ బోయినపల్లి సురేష్, సత్యనారాయణ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తిశ్రద్ధలతో గణనాథుడి ఉత్సవాలు నిర్వహిస్తున్న నిర్వాహకులను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



