వార్త ముఖ్యాంశాలు
- ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 21 (పున్నమి ప్రతినిధి) టీడీపీ నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు అభ్యర్థుల నామినేషన్లు మనుబోలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మనుబోలు మండలంలోని 11 ఎంపీటీసీ స్థానాలకు బుధవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
- అభ్యర్థులు తమ మద్దతుదారులతో ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని నామినేషన్లు దాఖలు చేశారు.
- టీడీపీ నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు.
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 21 (పున్నమి ప్రతినిధి)
టీడీపీ నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు అభ్యర్థుల నామినేషన్లు
మనుబోలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మనుబోలు మండలంలోని 11 ఎంపీటీసీ స్థానాలకు బుధవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు తమ మద్దతుదారులతో ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. కొమ్మలపూడి నుంచి సుజిత, కాగితాలపూరు నుంచి లక్ష్మమ్మ, మడమనూరు నుంచి పముజుల నాగరాజు, వీరంపల్లి నుంచి తురుమెళ్ల కామేశ్వరమ్మ నామినేషన్లు వేశారు. అక్కంపేట నుంచి జి. భారతి, వీరంపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. పోలీసుల ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.