వార్త ముఖ్యాంశాలు
- కోటిపల్లి–నరసాపురం రైల్వే లైన్‌పై చర్చ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ 2.0, దసరా ఉత్సవాలకు రావాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని, కేసినేని శివనాథ్, ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారితో కలిసి అమలాపురం ఎంపీ జీఎం…
- అనంతరం కోటిపల్లి–నరసాపురం రైల్వే లైన్ ప్రాజెక్టుపై కేంద్ర మంత్రితో చర్చించారు.
- ఈ ప్రాజెక్టులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన రూ.100 కోట్ల రాష్ట్ర వాటా అంశాన్ని ప్రస్తావించారు.
కోటిపల్లి–నరసాపురం రైల్వే లైన్‌పై చర్చ
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ 2.0, దసరా ఉత్సవాలకు రావాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని, కేసినేని శివనాథ్, ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారితో కలిసి అమలాపురం ఎంపీ జీఎం హరీష్ బాలయోగి గారు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. అనంతరం కోటిపల్లి–నరసాపురం రైల్వే లైన్ ప్రాజెక్టుపై కేంద్ర మంత్రితో చర్చించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన రూ.100 కోట్ల రాష్ట్ర వాటా అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని మంత్రి అశ్విని వైష్ణవ్ అభినందించారు. ప్రాజెక్టు నిర్మాణానికి తదుపరి కార్యాచరణపై ఎంపీ చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ఎన్డీయే ప్రభుత్వాల సహకారంతో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ ప్రజల చిరకాల కలను సాకారం చేసేందుకు కృషి చేస్తామని హరీష్ బాలయోగి తెలిపారు.