Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

కలిగిరిలో కార్డన్‌ అండ్‌ సెర్చ్‌.. 31 వాహనాలు స్వాధీనం

Punnami Newsroom Published:
కలిగిరిలో కార్డన్‌ అండ్‌ సెర్చ్‌.. 31 వాహనాలు స్వాధీనం

Story highlights

  • కలిగిరి: మండలంలోని గంగిరెడ్డిపాలెంలో పోలీసులు కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు.
  • సీఐ ఆధ్వర్యంలో 25 మంది పోలీసు సిబ్బంది గ్రామంలోని 85 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
  • సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 28 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలు, ఒక కారును కలిపి మొత్తం 31 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

కలిగిరి: మండలంలోని గంగిరెడ్డిపాలెంలో పోలీసులు కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. సీఐ ఆధ్వర్యంలో 25 మంది పోలీసు సిబ్బంది గ్రామంలోని 85 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 28 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలు, ఒక కారును కలిపి మొత్తం 31 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో అనుమానితుల వివరాలను పరిశీలించి, ప్రజలకు భద్రతపై అవగాహన కల్పించారు. ఆపరేషన్‌ త్రిశూల్‌ లక్ష్యాలను వివరించారు. గ్రామంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజలు పోలీసులకు సహకరించి శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *