ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 9 (పున్నమి ప్రతినిధి)
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు ఎఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి మృతి చెందడంతో విషాదం నెలకొంది. ఆయన భౌతికకాయానికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి స్వయంగా పాడి మోసి కడచూపు నివాళి అర్పించారు. రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్థులు పాల్గొని గాలి రామకృష్ణారెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. ఆయన సేవలను పలువురు నాయకులు గుర్తు చేసుకున్నారు.

ఎఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొని పాడి మోసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి.
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 9 (పున్నమి ప్రతినిధి) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు ఎఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి మృతి చెందడంతో విషాదం నెలకొంది. ఆయన భౌతికకాయానికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి స్వయంగా పాడి మోసి కడచూపు నివాళి అర్పించారు. రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్థులు పాల్గొని గాలి రామకృష్ణారెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. ఆయన సేవలను పలువురు నాయకులు గుర్తు చేసుకున్నారు.

