కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసంలో ఈడీ సోదాల అనంతరం అధికారులపై జరిగిన దాడి కేసులో ఐదుగురు సీపీఎం కార్యకర్తలకు కోర్టు బెయిల్ నిరాకరించింది. సోదాలు ముగించుకుని తిరిగి వెళ్తున్న ఈడీ అధికారులపై దాడి చేసి వాహనాలను ధ్వంసం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు విధుల్లోనే ఉన్నారని, అందువల్ల ప్రభుత్వ ఉద్యోగుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించారనే అభియోగాలు వర్తిస్తాయని ప్రాసిక్యూషన్ వాదించింది. ఈ ఘటనలో ఇప్పటికే 25 మందిని అరెస్టు చేశారు. సుమారు 300 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారం కేరళ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

ఈడీ అధికారులపై దాడి కేసులో నిందితులకు బెయిల్ నిరాకరణ