వార్త ముఖ్యాంశాలు
- ఆత్మకూరు, నవంబర్ 18 (పున్నమి ప్రతినిధి): ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుకుంటోంది గడ్డం వారి కుటుంబం.
- ఆత్మకూరు మండలం నువ్వూరుపాడు పంచాయతీ పరిధిలోని పాత జంగాలపల్లి ఎస్సీ కాలనీకి చెందిన కటారి సుబ్బరాయుడు తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు.
- ఈ విషయం తెలుసుకున్న గడ్డం కుటుంబ సభ్యులు మృతుడి అంత్యక్రియల నిమిత్తం రూ.5 వేల తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు.పాత జంగాలపల్లికి చెందిన స్వర్గీయ గడ్డం విజయభాస్కర్‌రెడ్డి గత నాలుగేళ్లుగా నువ్వూరుపాడు పంచాయతీ పరిధిలో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబాలకు అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.5 వేల…
ఆత్మకూరు, నవంబర్ 18 (పున్నమి ప్రతినిధి): ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుకుంటోంది గడ్డం వారి కుటుంబం. ఆత్మకూరు మండలం నువ్వూరుపాడు పంచాయతీ పరిధిలోని పాత జంగాలపల్లి ఎస్సీ కాలనీకి చెందిన కటారి సుబ్బరాయుడు తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న గడ్డం కుటుంబ సభ్యులు మృతుడి అంత్యక్రియల నిమిత్తం రూ.5 వేల తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు.పాత జంగాలపల్లికి చెందిన స్వర్గీయ గడ్డం విజయభాస్కర్‌రెడ్డి గత నాలుగేళ్లుగా నువ్వూరుపాడు పంచాయతీ పరిధిలో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబాలకు అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.5 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తూ వచ్చారు. ఇటీవల ఆయన అనారోగ్యంతో అకాల మరణం చెందడంతో, ఆయన సేవా స్ఫూర్తిని కొనసాగించాలనే ఉద్దేశంతో ఆయన సోదరుడు గడ్డం శ్రీనివాసులురెడ్డి ఈ బాధ్యతను స్వీకరించారు.ఈ క్రమంలో తాజాగా మృతి చెందిన కటారి సుబ్బరాయుడు కుటుంబ సభ్యులకు రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన గడ్డం శ్రీనివాసులురెడ్డికి మృతుడి కుటుంబ సభ్యులు, పాత జంగాలపల్లి ఎస్సీ కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సుభహాన్, శ్రీరాములురెడ్డి, ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ గడ్డం విజయభాస్కర్‌రెడ్డి ప్రారంభించిన సేవా కార్యక్రమాన్ని ఆయన కుటుంబ సభ్యులు కొనసాగించడం పలువురి ప్రశంసలు అందుకుంటోంది.