అయినాపురం ఎంపిటిసి 1 అభ్యర్థిగా సబ్బతి డేవిడ్ రాజు నామినేషన్ దాఖలు
స్థానిక శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు ఆశీస్సులతో బరిలోకి నామినేషన్ పత్రాలు అందజేత
ముమ్మిడివరం మండలం అయినాపురం ఎంపీటీసీ 1అభ్యర్థిగా సబ్బతి డేవిడ్ రాజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు.
నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. రానున్న రోజుల్లో ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కే అవకాశముండటంతో అయినాపురం ఎంపీటీసీ ఎన్నికలపై గ్రామంలో ఆసక్తి నెలకొంది..
