Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

అమ్మపాలెం వాసి వెంకట సుబ్బారెడ్డి మృతిపై మాజీ ఎమ్మెల్యే సంతాపం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అమ్మపాలెం వాసి వెంకట సుబ్బారెడ్డి మృతిపై మాజీ ఎమ్మెల్యే సంతాపం

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి, మార్చి 15 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి మండలంలోని అమ్మపాలెం గ్రామానికి చెందిన వెంకట సుబ్బారెడ్డి ఇటీవల ఆకస్మికంగా మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
  • ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వారి ఇంటికి చేరుకుని సుబ్బారెడ్డి కర్మక్రియల్లో పాల్గొన్నారు.
  • ఈ సందర్భంగా వెంకట సుబ్బారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

శ్రీకాళహస్తి, మార్చి 15 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి మండలంలోని అమ్మపాలెం గ్రామానికి చెందిన వెంకట సుబ్బారెడ్డి ఇటీవల ఆకస్మికంగా మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వారి ఇంటికి చేరుకుని సుబ్బారెడ్డి కర్మక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకట సుబ్బారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషాద సమయంలో తాము వారి కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యుగంధర్ రెడ్డి, రాజేష్ రెడ్డి, శివ రెడ్డి, శంకరయ్య, చంద్ర రెడ్డి, సుమన్, మాధవ, మధు రెడ్డి, శ్రవణ్ రెడ్డి, హరి రెడ్డి తదితరులు పాల్గొని వెంకట సుబ్బారెడ్డికి నివాళులు అర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *