వార్త ముఖ్యాంశాలు
- – సీఐటీయూ డిమాండ్ నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్‌లో పనిచేస్తూ అకారణంగా తొలగించబడ్డ 5 మంది పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) నాయకులు డిమాండ్ చేశారు.
- బుధవారం నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్ ఆవరణలోని హెల్త్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ జరిపి రైల్వే స్టేషన్ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు.
- ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.
– సీఐటీయూ డిమాండ్
నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్‌లో పనిచేస్తూ అకారణంగా తొలగించబడ్డ 5 మంది పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్ ఆవరణలోని హెల్త్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ జరిపి రైల్వే స్టేషన్ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. అజయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల శ్రీనివాసులు, నగర కార్యదర్శి జి. నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా 5 మంది కార్మికులను విధుల నుంచి అక్రమంగా తొలగించడం సరికాదన్నారు. తొలగించిన ఈ 5 మందిని బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఆ కార్మికులకు సుమారు 2 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదని, వెంటనే వారి జీతాల బకాయిలను కార్మికుల అకౌంట్లలో జమ చేయాలన్నారు.
మహిళా కార్మికుల పట్ల వేధింపులకు దిగుతున్న కాంట్రాక్టర్ రంగస్వామిని, హెల్త్ ఇన్‌స్పెక్టర్‌ను, సూపర్‌వైజర్ సురేష్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సమస్యను త్వరలో పరిష్కరించాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు మూలం ప్రసాద్, స్వర్ణ బాబూరావు, ఎస్. అంకయ్య, రవీంద్ర, శ్రీనివాసులు, సీహెచ్. చెంగయ్య, అమన్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.