Saturday, 26 September 2026
  • Home  
  • సిద్ధంగా విద్యుత్ స్తంభం.. గ్రామస్తుల ఆందోళన
- అల్లూరి సీతారామరాజు

సిద్ధంగా విద్యుత్ స్తంభం.. గ్రామస్తుల ఆందోళన

అనంతగిరి మండలం పైనంపాడు పంచాయతీ పరిధిలోని ఈదులపుట్టు గ్రామంలో పాత ఇనుప విద్యుత్ స్తంభం కూలేందుకు సిద్ధంగా ఉండటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సుమారు 20 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ ఇనుప స్తంభం ప్రస్తుతం పూర్తిగా తుప్పుపట్టి బలహీనంగా మారిందని గ్రామస్తులు తెలిపారు. స్తంభం ఎప్పుడు కూలి ఇళ్లపై పడుతుందోనని భయాందోళనకు గురవుతున్నామని పేర్కొన్నారు. ప్రమాదం జరగకముందే విద్యుత్ అధికారులు స్పందించి పాడైపోయిన స్తంభాన్ని తొలగించి, కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్తుడు సిందుకోడి రాంబాబు విజ్ఞప్తి చేశారు. సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

అనంతగిరి మండలం పైనంపాడు పంచాయతీ పరిధిలోని ఈదులపుట్టు గ్రామంలో పాత ఇనుప విద్యుత్ స్తంభం కూలేందుకు సిద్ధంగా ఉండటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సుమారు 20 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ ఇనుప స్తంభం ప్రస్తుతం పూర్తిగా తుప్పుపట్టి బలహీనంగా మారిందని గ్రామస్తులు తెలిపారు.
స్తంభం ఎప్పుడు కూలి ఇళ్లపై పడుతుందోనని భయాందోళనకు గురవుతున్నామని పేర్కొన్నారు. ప్రమాదం జరగకముందే విద్యుత్ అధికారులు స్పందించి పాడైపోయిన స్తంభాన్ని తొలగించి, కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్తుడు సిందుకోడి రాంబాబు విజ్ఞప్తి చేశారు. సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.