*🟨మారనున్న పోటుపాలెం రూపురేఖలు…**🟨₹2.13 కోట్లతో సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ చేతుల మీదగా రేపే గ్రాండ్ ఓపెనింగ్!.**🟨 పోటుపాలెం అభివృద్ధికి రూ.2.13 కోట్ల భారీ నిధులు మంజూరు!**🟨 బైపాస్ రోడ్డు నుంచి వరగలీ రోడ్డు వరకు సీసీ రోడ్డు నిర్మాణం!**🟨 ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ ప్రత్యేక చొరవతో రోడ్డు పనులకు శ్రీకారం!**🟨 అభివృద్ధి పనుల మంజూరులో హరికుమార్ చొరవకు గ్రామస్థుల ప్రశంసలు!**🟨 పోటుపాలెం రవాణా కష్టాలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు!**🟨 అక్టోబర్ 2న ( రేపు ) ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ చేతుల మీదుగా శంకుస్థాపన!**🟨 శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వాటంబేడు హరికుమార్ పిలుపు!**———————* *✍🏽వినోద్ కమార్ 👇🏽* *జర్నలిస్ట్**———————-*ప్రభుత్వాలు మారినా, పాలకుల హామీలు మారినా ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని పోటుపాలెం ప్రజల రవాణా కష్టాలకు ఎట్టకేలకు తెరపడింది. గ్రామస్థులు దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న కల నేడు నెరవేరబోతోంది. గూడూరు శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ప్రత్యేక శ్రద్ధ, చొరవతో పోటుపాలెం గ్రామానికి రూ. 2 కోట్ల 13 లక్షల భారీ నిధులు మంజూరయ్యాయి.పోటుపాలెం బైపాస్ రోడ్డు నుండి వరగలీ రోడ్డు వరకు అత్యంత నాణ్యతా ప్రమాణాలతో సీసీ రోడ్డు నిర్మాణానికి బాటలు పడ్డాయి. ఈ పనులను ప్రముఖ మెగా కాంట్రాక్టర్ దక్కించుకోవడంతో గ్రామ రూపురేఖలే మారిపోనున్నాయని స్థానికులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.*🟨నాయకుల కృషి – సమన్వయం!*ఈ ప్రాజెక్టు మంజూరు వెనుక గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ దూరదృష్టి, అభివృద్ధి సంకల్పం ఎంతైనా ఉందని స్థానికులు కొనియాడుతున్నారు. అదే సమయంలో, గ్రామ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి, పనుల మంజూరు కోసం నిరంతరం శ్రమించిన టిడిపి గూడూరు పట్టణ ప్రధాన కార్యదర్శి మరియు పోటుపాలెం పంచాయతీ ఇంచార్జి వాటంబేడు హరికుమార్ పాత్ర ఎంతో ప్రశంసనీయమైనది. స్థానిక సమస్యల పరిష్కారంలో హరికుమార్ చూపిన చొరవతోనే నేడు ఈ కల సాధ్యమైందని గ్రామస్తులు కొనియాడుతున్నారు.*🟨రేపే వైభవంగా శంకుస్థాపన కార్యక్రమం*ఈ చారిత్రాత్మక ఘట్టానికి సంబంధించి అక్టోబర్ 2వ తేదీన (రేపు) బైపాస్ వద్ద సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ చేతుల మీదుగా అధికారికంగా శంకుస్థాపన జరగనుంది.రోడ్డు మంజూరు కావడానికి అహరహం కృషి చేసిన ఎమ్మెల్యే కి, అలాగే స్థానిక సమస్యలను నిరంతరం ఆయన దృష్టికి తీసుకెళ్లి పనులు వేగవంతం చేసిన టీడీపీ గూడూరు పట్టణ ప్రధాన కార్యదర్శి, పోటుపాలెం పంచాయతీ ఇంచార్జ్ వాటంబేడు హరికుమార్ కు గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.*🟨కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: వాటంబేడు హరికుమార్ పిలుపు*టిడిపి గూడూరు పట్టణ ప్రధాన కార్యదర్శి మరియు పోటుపాలెం పంచాయతీ ఇంచార్జి వాటంబేడు హరికుమార్ మాట్లాడుతూ “ఎన్నో ఏళ్ల పోటుపాలెం ప్రజల నిరీక్షణకు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ ముగింపు పలికారు. మన గ్రామాభివృద్ధికి ప్రాధాన్యమిచ్చి భారీ నిధులు కేటాయించినందుకు గ్రామస్థులందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రేపు జరుగుతున్న శంకుస్థాపన మహోత్సవానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు మరియు యువత పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి” అని కోరారు.


