Thursday, 1 October 2026
  • Home  
  • పెగడబండ రాము కుటుంబానికి అండగా పదో తరగతి మిత్రులు రూ.22 వేల ఆర్థిక సహాయం.. ముగ్గురు పిల్లలకు మాగనూరు ఆరాధ్య హైస్కూల్‌లో పదో తరగతి వరకు ఉచిత విద్య
- నారాయణపేట

పెగడబండ రాము కుటుంబానికి అండగా పదో తరగతి మిత్రులు రూ.22 వేల ఆర్థిక సహాయం.. ముగ్గురు పిల్లలకు మాగనూరు ఆరాధ్య హైస్కూల్‌లో పదో తరగతి వరకు ఉచిత విద్య

వాగులో నీటిలో మునిగి సుమారు 15 రోజుల క్రితం మృతి చెందిన తమ స్నేహితుడు పెగడబండ రాము కుటుంబానికి పదో తరగతి మిత్రులు అండగా నిలిచారు. రాము కుటుంబాన్ని పరామర్శించిన మిత్రులు అందరూ కలిసి రూ.22,000 ఆర్థిక సహాయం అందించారు. అదేవిధంగా రాముకు చెందిన ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు మొత్తం ముగ్గురు పిల్లలకు మాగనూరులోని ఆరాధ్య హైస్కూల్‌లో LKG నుంచి పదో తరగతి వరకు ఉచితంగా విద్యాబోధన అందిస్తామని మిత్రుడు సగరం మధుసూదన్ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. అవసరమైన సమయంలో రాము కుటుంబానికి మిత్రులుగా అండగా ఉంటామని, భవిష్యత్తులో కూడా ఎలాంటి సహాయం కావాలన్నా తమ వంతు సహకారం అందిస్తామని మిత్రులు తెలిపారు. ఈ సహాయ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క మిత్రుడికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

వాగులో నీటిలో మునిగి సుమారు 15 రోజుల క్రితం మృతి చెందిన తమ స్నేహితుడు పెగడబండ రాము కుటుంబానికి పదో తరగతి మిత్రులు అండగా నిలిచారు. రాము కుటుంబాన్ని పరామర్శించిన మిత్రులు అందరూ కలిసి రూ.22,000 ఆర్థిక సహాయం అందించారు.
అదేవిధంగా రాముకు చెందిన ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు మొత్తం ముగ్గురు పిల్లలకు మాగనూరులోని ఆరాధ్య హైస్కూల్‌లో LKG నుంచి పదో తరగతి వరకు ఉచితంగా విద్యాబోధన అందిస్తామని మిత్రుడు సగరం మధుసూదన్ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.
అవసరమైన సమయంలో రాము కుటుంబానికి మిత్రులుగా అండగా ఉంటామని, భవిష్యత్తులో కూడా ఎలాంటి సహాయం కావాలన్నా తమ వంతు సహకారం అందిస్తామని మిత్రులు తెలిపారు. ఈ సహాయ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క మిత్రుడికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.