ఖమ్మం: గణేష్ నిమజ్జనాన్ని పురస్కరించుకుని ఖమ్మం అర్బన్ మండలం ధంసలాపురం చెరువు నిమజ్జనం పాయింట్‌కు గణేష్ విగ్రహాలు చేరుకునేందుకు పోలీసులు ప్రత్యేక మార్గాలను సూచించారు. రూరల్ మండలం, రాపర్తి నగర్, బీసీ కాలనీ, కూరగాయల మార్కెట్, ఆర్‌ఆర్ స్కూల్, కొత్త బస్టాండ్, సాయిబాబా ఆర్చ్, ఆర్టీఏ కార్యాలయం, బ్యాంక్ కాలనీ, వికలాంగుల కాలనీ, బల్లేపల్లి, ఖానాపురం, టేకులపల్లి, న్యూ విజన్ కాలేజ్ వైపు నుంచి వచ్చే విగ్రహాలు బైపాస్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్, ఇల్లందు ఎక్స్‌రోడ్, ప్రభుత్వ ఆసుపత్రి, జడ్పీ సెంటర్, చెరువు బజార్, బోనకల్ ఎక్స్‌రోడ్, చర్చి కాంపౌండ్, ముస్తాఫ్‌నగర్, సంబానినగర్, రాఘవ మెడికల్స్, శ్రీరామ్ హిల్స్ మీదుగా చెరువుకు చేరుకోవాలి.
పంపింగ్ వెల్ రోడ్, గాంధీనగర్, మోతీనగర్, పీఎస్‌ఆర్ రోడ్, గాంధీచౌక్, సారధినగర్, బొక్కలగడ్డ నుంచి వచ్చే వాహనాలు నయాబజార్, జూబ్లీ క్లబ్, మయూరి సెంటర్ మీదుగా వెళ్లాలి. బస్ డిపో, కమాన్ బజార్, కస్బా బజార్ నుంచి కిన్నెర సెంటర్, జడ్పీ సెంటర్, చెరువు బజార్, చర్చి కాంపౌండ్ మార్గంలో వెళ్లాలి. శ్రీనగర్, రోటరీనగర్, ఇందిరానగర్, మమత ఎక్స్‌రోడ్, కవిరాజునగర్, గట్టయ్య సెంటర్, బ్యాంక్ కాలనీ, వీడియోస్ కాలనీ నుంచి ఇల్లందు ఎక్స్‌రోడ్, జడ్పీ, చర్చి కాంపౌండ్ మీదుగా చేరాలి. వెంకటగిరి, శ్రీనివాసనగర్, గ్రెయిన్ మార్కెట్, ప్రకాష్‌నగర్, గుట్టల బజార్, జహీర్‌పుర్ తండా, అయ్యప్ప ఆలయం నుంచి మెయిన్ రోడ్ మీదుగా చర్చి కాంపౌండ్ చేరాలి. గొల్లగూడెం, మధురానగర్, రాఘవయ్యనగర్, మమత కాలేజ్, హార్వెస్ట్ స్కూల్, అల్లిపురం, కొత్తగూడెం నుంచి టాటా మోటార్స్, చెరువు బజార్, చర్చి కాంపౌండ్ మార్గంలో, బోనకల్ ఎక్స్‌రోడ్, పోలీస్ హెడ్‌క్వార్టర్స్, మిషన్ హాస్పిటల్, ముస్తాఫానగర్, సంబానినగర్, పరికముక్కల కాలనీ, శ్రీరామ్‌నగర్, శ్రీరామ్ హిల్స్ నుంచి వచ్చే విగ్రహాలు మెయిన్ రోడ్ మీదుగా నిమజ్జనం పాయింట్‌కు చేరుకోవాలని సూచించారు.



