వైఎస్సార్సీపీ నుంచి జనసేనలో చేరికలపై! చేట్ల రామారావు విమర్శలు
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం గన్నవరం మండలం ముంగుండపాలెం గ్రామానికి చెందిన కొందరు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇటీవల జనసేన పార్టీలో చేరినట్లు ప్రకటించడంపై వైఎస్సార్సీపీ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర బూత్ కమిటీ వింగ్ సెక్రెటరీ చేట్ల రామారావు స్పందించారు.
వైఎస్సార్సీపీ నుంచి కూటమి పార్టీలోకి వెళ్లాల్సిన పరిస్థితి తమ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అవసరం లేదని చేట్ల రామారావు అన్నారు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ మార్పులను ప్రోత్సహించడం సరికాదని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా పార్టీ కోసం ఐక్యంగా పనిచేయాలని చేట్ల రామారావు పిలుపునిచ్చారు.
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. వైఎస్సార్సీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో నాయకులు, కార్యకర్తలు అహర్నిశలు శ్రమిస్తారని చేట్ల రామారావు తెలిపారు. పార్టీ శ్రేణులు ఐక్యతతో ముందుకు సాగాలని వైఎస్సార్సీపీ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర బూత్ కమిటీ వింగ్ సెక్రెటరీ చేట్ల రామారావు కోరారు.
Uploaded Video:


