పుల్లంపేట మండలం కేతరాజుపల్లి అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి గర్భిణులు, బాలింతలు, చిన్నారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్త సరోజనమ్మ మాట్లాడుతూ ఐసీడీఎస్ ద్వారా అందిస్తున్న అనుబంధ పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలు, చిన్నారులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఆకుకూరలు, కోడిగుడ్లు, పాలు, మాంసకృత్తులతో పాటు విటమిన్లు, ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు. పౌష్టికాహారంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, చిన్నారులకు సకాలంలో టీకాలు వేయించాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకుని తల్లులు, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎం. శివరాం ప్రసాద్, ఎం. శ్రీనివాసులు, అంగన్వాడీ హెల్పర్ నాగమణి, తల్లులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

కేతరాజుపల్లిలో ఘనంగా అంగన్వాడీ ఉత్సవం