బి.ఎన్.రెడ్డి: హైదరాబాద్ రాకర్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న వినాయక చవితి అన్నదాన కార్యక్రమానికి రంగా కుటుంబ సభ్యులు తమ వంతు సహకారం అందించారు. రంగా సుదర్శన్, రంగా సుమతి, రంగా నరేష్, రంగా ప్రీతి, రంగా అర్జున్‌లు కలిసి ఈ ఏడాది కూడా విరాళం అందించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద లడ్డూకు రూ.99,999, చిన్న లడ్డూకు రూ.85,001, పంచ, శాలువా, కలశానికి రూ.60,001 చొప్పున ఒకే కుటుంబ సభ్యులు కైవసం చేసుకున్నారు.
గత ఆరు సంవత్సరాలకు పైగా రంగా కుటుంబం అన్నదాన కార్యక్రమానికి స్పాన్సర్‌గా కొనసాగుతూ పలు సేవా కార్యక్రమాలకు తమ సహకారం అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
హైదరాబాద్ రాకర్స్ యూత్ అసోసియేషన్ 2007లో స్థాపించబడిన సంస్థగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు సేవలందిస్తోంది.
సేవా కార్యక్రమాలకు నిరంతరం సహకరిస్తున్న రంగా కుటుంబ సభ్యులకు హైదరాబాద్ రాకర్స్ యూత్ అసోసియేషన్ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.



