Friday, 2 October 2026
  • Home  
  • దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి శాసనసభ శ్రద్ధాంజలి తీర్మానం: అసెంబ్లీ స్పీకర్ సంతకం చేసిన కాపీ అందజేత
- వరంగల్

దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి శాసనసభ శ్రద్ధాంజలి తీర్మానం: అసెంబ్లీ స్పీకర్ సంతకం చేసిన కాపీ అందజేత

నర్సంపేట శాసనసభ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, దివంగత నేత గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు అందించిన నిరుపమాన సేవలను స్మరిస్తూ తెలంగాణ శాసనసభ ఘనంగా నివాళులర్పించింది. ​గత సెప్టెంబర్ 8, 2026న తెలంగాణ శాసనసభలో ఆమోదించిన సంతాప తీర్మాన ప్రతిని, గౌరవ అసెంబ్లీ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు సంతకం చేసిన ఫోటో కాపీని నేడు నల్లబెల్లి MRO గారు, వరంగల్ జిల్లా మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి గారికి అందజేశారు. ​అసెంబ్లీ సంతాప తీర్మానం సారాంశం: నర్సంపేట మాజీ సభ్యులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ శాసనసభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది. సభ ఏకగ్రీవంగా ఈ సంతాప తీర్మానాన్ని ఆమోదిస్తూ, వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ కొద్దిసేపు మౌనం పాటించింది. ​ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

నర్సంపేట శాసనసభ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, దివంగత నేత గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు అందించిన నిరుపమాన సేవలను స్మరిస్తూ తెలంగాణ శాసనసభ ఘనంగా నివాళులర్పించింది.
​గత సెప్టెంబర్ 8, 2026న తెలంగాణ శాసనసభలో ఆమోదించిన సంతాప తీర్మాన ప్రతిని, గౌరవ అసెంబ్లీ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు సంతకం చేసిన ఫోటో కాపీని నేడు నల్లబెల్లి MRO గారు, వరంగల్ జిల్లా మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి గారికి అందజేశారు.
​అసెంబ్లీ సంతాప తీర్మానం సారాంశం:
నర్సంపేట మాజీ సభ్యులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ శాసనసభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది. సభ ఏకగ్రీవంగా ఈ సంతాప తీర్మానాన్ని ఆమోదిస్తూ, వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ కొద్దిసేపు మౌనం పాటించింది.
​ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.