– సేవా కార్యక్రమాల్లో భాగంగా రక్త సేకరణ
పుల్లంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహణ
పుల్లంపేట, సెప్టెంబర్ 26: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని పుల్లంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో బీజేపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. బీజేపీ పుల్లంపేట మండల అధ్యక్షుడు మనోహర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చెంగల్రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాజరై రక్తదాతలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం ఆపదలో ఉన్న వారికి ప్రాణదానంతో సమానమైన మానవతా సేవ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆయురారోగ్యాలతో ఉండి దేశ ప్రజలకు మరింతకాలం సేవలందించాలని ఆకాంక్షించారు. జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బీజేపీ, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, స్థానిక నాయకులు, రక్తదాతలు పాల్గొన్నారు.


