మధిర,/ఖమ్మం
ఇటీవల కురిసిన వర్షాలతో మధిర ఆర్టీసీ బస్టాండ్ బురదమయంగా మారింది. బస్టాండ్ ఆవరణలో నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు ఎక్కేందుకు, దిగేందుకు బురదలో నడవాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు. అధికారులు స్పందించి నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టడంతో పాటు, బురద సమస్య పరిష్కారానికి అవసరమైన డస్ట్ చల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బస్టాండ్ ఆవరణను పరిశుభ్రంగా ఉంచి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. ఆదివారం పున్నమి ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పువ్వాడ నాగేంద్ర కుమార్ మధిర బస్టాండ్‌ను సందర్శించగా ప్రయాణికులు తమ సమస్యలను వివరించారు.


