Thursday, 24 September 2026
  • Home  
  • భారీ వర్షాలపై అప్రమత్తం.. ఖమ్మంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- ఖమ్మం

భారీ వర్షాలపై అప్రమత్తం.. ఖమ్మంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వరద పరిస్థితులను పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ దివాకర్ టీ.ఎస్. తెలిపారు. వాగులు, వంకలు, చెరువుల నీటిమట్టాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైతే అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. వరద నీటి ప్రవాహంలో ప్రజలు ప్రయాణించవద్దని, అత్యవసర పరిస్థితుల్లో అధికారులు సూచించిన జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ కోరారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా వెంటనే స్పందించేలా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అత్యవసర సమాచారం కోసం 1077 లేదా 9063211298 నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ దివాకర్ టీ.ఎస్. ప్రజలకు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.