Wednesday, 30 September 2026
  • Home  
  • మామిళ్లగూడెం యూపీహెచ్‌సీలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ
- ఖమ్మం

మామిళ్లగూడెం యూపీహెచ్‌సీలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ

ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ (యూపీహెచ్‌సీ)ను డీఎంహెచ్‌ఓ డాక్టర్ రామారావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో కొనసాగుతున్న సాధారణ టీకాల ప్రక్రియ, ఓపీ సేవలు, ల్యాబ్ నిర్వహణ, వ్యాక్సినేషన్ రికార్డులను పరిశీలించారు. గర్భిణీల సంరక్షణలో భాగంగా ఏఎన్‌సీ (ANC) రిజిస్ట్రేషన్ల శాతాన్ని మరింత పెంచాలని సిబ్బందికి సూచించారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కేంద్రాల ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని డాక్టర్ రామారావు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.