ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 2 ( పున్నమి ప్రతినిధి)
గాంధీ జయంతి సందర్భంగా మనుబోలు మండలంలో చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారి గరుడయ్య పాల్గొని చిన్నారులకు స్వయంగా చాక్లెట్లు అందజేశారు. మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింసా మార్గాలను చిన్నతనం నుంచే పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. చిన్నారులతో ముచ్చటిస్తూ వారి చదువు, ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ఎంతో ఉత్సాహంగా కనిపించారు.

గాంధీ జయంతి సందర్భంగా చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 2 ( పున్నమి ప్రతినిధి) గాంధీ జయంతి సందర్భంగా మనుబోలు మండలంలో చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారి గరుడయ్య పాల్గొని చిన్నారులకు స్వయంగా చాక్లెట్లు అందజేశారు. మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింసా మార్గాలను చిన్నతనం నుంచే పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. చిన్నారులతో ముచ్చటిస్తూ వారి చదువు, ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ఎంతో ఉత్సాహంగా కనిపించారు.

