Thursday, 1 October 2026
  • Home  
  • అన్నమయ్య జిల్లా కురబలకోట టెంపోను ఢీకొన్న లారీ: 13 మంది వలస కార్మికులకు గాయాలు
- అన్నమయ్య

అన్నమయ్య జిల్లా కురబలకోట టెంపోను ఢీకొన్న లారీ: 13 మంది వలస కార్మికులకు గాయాలు

బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లా కురబలకోట టెంపోను ఢీకొన్న లారీ: 13 మంది వలస కార్మికులకు గాయాలు లారీ టెంపోను ఢీకొట్టడంతో 13 మంది బీహార్ వలస కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం ఉదయం కురబలకోట మండలంలో జరిగిన ఘటనపై బాధితుల కథనం.. బీహార్ పూర్ణియా జిల్లాకు చెందిన వీరు మదనపల్లె రామాచర్లపల్లె కాంట్రాక్టర్ చలపతి వద్ద ఏడాది కాలంగా దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. శనివారం ఉదయం వీరిని టెంపోలో వాహనంలో అంగళ్లకు తరలిస్తుండగా చేనేతనగర్ వద్ద లారీ టెంపోను ఢీకొట్టింది. అందులో మోల్డింగ్ పనులకు వెళుతున్న క్షతగాత్రులను స్థానికులు జిల్లా ఆసుపత్రికి తరలించగా, ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్య చికిత్సలు అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటనపై ముదివేడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బ్రేకింగ్ న్యూస్
అన్నమయ్య జిల్లా కురబలకోట
టెంపోను ఢీకొన్న లారీ: 13 మంది వలస కార్మికులకు గాయాలు
లారీ టెంపోను ఢీకొట్టడంతో 13 మంది బీహార్ వలస కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం ఉదయం కురబలకోట మండలంలో జరిగిన ఘటనపై బాధితుల కథనం.. బీహార్ పూర్ణియా జిల్లాకు చెందిన వీరు మదనపల్లె రామాచర్లపల్లె కాంట్రాక్టర్ చలపతి వద్ద ఏడాది కాలంగా దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. శనివారం ఉదయం వీరిని టెంపోలో వాహనంలో అంగళ్లకు తరలిస్తుండగా చేనేతనగర్ వద్ద లారీ టెంపోను ఢీకొట్టింది. అందులో మోల్డింగ్ పనులకు వెళుతున్న క్షతగాత్రులను స్థానికులు జిల్లా ఆసుపత్రికి తరలించగా, ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్య చికిత్సలు అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటనపై ముదివేడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.