Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో నెల్లూరు పోలీసులు పచ్చదనం కోసం ముందుండి నడుస్తున్నారు: డి.ఎస్.పి. (AR) శ్రీ చంద్రమోహన్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో నెల్లూరు పోలీసులు పచ్చదనం కోసం ముందుండి నడుస్తున్నారు – SPS నెల్లూరు జిల్లా, పున్నమి ప్రతినిధి నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం భాగంగా, నెల్లూరు జిల్లా పోలీసులు పర్యావరణ పరిరక్షణపై ఒక…
  • జిల్లా ఎస్పీ శ్రీ జి.
  • కృష్ణకాంత్, IPS గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయం ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది.

స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో నెల్లూరు పోలీసులు పచ్చదనం కోసం ముందుండి నడుస్తున్నారు

– SPS నెల్లూరు జిల్లా, పున్నమి ప్రతినిధి

నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం భాగంగా, నెల్లూరు జిల్లా పోలీసులు పర్యావరణ పరిరక్షణపై ఒక ప్రత్యేక చైతన్య ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్, IPS గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయం ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది.

ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఇ-వేస్ట్ (ఇ-వ్యర్థాలు) శాస్త్రీయంగా తొలగింపు పై అవగాహన కలిగించుకునేలా ప్రతిజ్ఞ తీసుకున్నారు. అనంతరం పలు నినాదాలతో కూడిన ర్యాలీ నిర్వహించబడింది.

ఈ సందర్భంగా జిల్లా పోలీసులు పలు ముఖ్యమైన అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లారు:

  • పాత ఎలక్ట్రానిక్ పరికరాల్లో పాదరసం, సీసం, కాడ్మియం, లిధియం వంటి విషపదార్థాలు ఉంటాయని, అవి మానవ ఆరోగ్యానికి తీవ్ర ముప్పు అని తెలిపారు.
  • ఈ గాడ్జెట్లను నియమిత ఈ-వేస్ట్ కలెక్షన్ కేంద్రాల్లో వదలాలన్న విజ్ఞప్తి చేశారు.
  • ఇవి సరైన రీతిలో తొలగించనిపోతే, మెదడు, గుండె, కాలేయం, కిడ్నీలు వంటి కీలక అవయవాలపై ప్రభావం చూపవచ్చని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా, పోలీసు కార్యాలయంలో సేకరించబడిన:

  • 57 మానిటర్లు,
  • 69 CPUలు (హార్డ్‌డిస్క్‌లు తొలగించినవి),
  • 26 కీబోర్డ్లు,
  • 14 ప్రింటర్లు,
  • 9 స్టేబిలైజర్లు,
  • 25 కార్ట్రిడ్జ్‌లు

ఇవి e-వేస్ట్‌గా డిస్ప్లే చేయడమైంది.

జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఈ-వేస్ట్ అవగాహన కార్యక్రమాలతో పాటు పిచ్చి మొక్కల తొలగింపు, పరిసరాల శుభ్రత వంటి చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి. (AR) శ్రీ చంద్రమోహన్ గారు, ఏఓ శ్రీ చంద్రమౌళి గారు, SB-2 CI, RIలు, ఆఫీస్ సూపరింటెండెంట్లు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

“మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి పౌరుని బాధ్యత. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో భాగస్వాములవ్వాలి” అని పోలీసులు ప్రజలకు పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *