ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 28 (పున్నమి ప్రతినిధి)
వెంకటాచలం: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. వెంకటాచలంలో గ్రామాల వారీగా నిర్వహించిన సమావేశంలో 14 గ్రామాల నాయకులు, కార్యకర్తలతో ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. గ్రామస్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. నాయకులు, కార్యకర్తల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించడమే లక్ష్యమన్నారు. టీడీపీ బెదిరింపులు, కుట్రలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటామని తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా అధికారులను కోరారు. రైతులు, ప్రజా సమస్యలపై పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

స్థానిక ఎన్నికల్లో గెలుపే ధ్యేయం: కాకాణి
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 28 (పున్నమి ప్రతినిధి) వెంకటాచలం: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. వెంకటాచలంలో గ్రామాల వారీగా నిర్వహించిన సమావేశంలో 14 గ్రామాల నాయకులు, కార్యకర్తలతో ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. గ్రామస్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. నాయకులు, కార్యకర్తల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించడమే లక్ష్యమన్నారు. టీడీపీ బెదిరింపులు, కుట్రలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటామని తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా అధికారులను కోరారు. రైతులు, ప్రజా సమస్యలపై పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

