Monday, 21 September 2026
  • Home  
  • శోంఠ్యం ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు
- విశాఖపట్నం

శోంఠ్యం ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

శోంఠ్యం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విశాఖపట్నం జిల్లా, ఆనందపురం,ఆగస్టు 15 (పున్నమి ప్రతినిధి): శోంఠ్యం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. ప్రధానోపాధ్యాయులు నగరి కమలేశ్వరి, పాఠశాల చైర్మన్ శైలజ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. పెద్దలు లెంక రాంబాబు, బొద్దపు బంగార్రాజు, లోకి రెడ్డి అచ్చిబాబు, కోరుకొండ మూర్తి, గొంతిన స్వామినాయుడు, కోరుకొండ కృష్ణ, కోరుకొండ శివ తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. దేశభక్తి, క్రమశిక్షణ, విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యమని వక్తలు పేర్కొన్నారు.

శోంఠ్యం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

విశాఖపట్నం జిల్లా, ఆనందపురం,ఆగస్టు 15 (పున్నమి ప్రతినిధి): శోంఠ్యం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. ప్రధానోపాధ్యాయులు నగరి కమలేశ్వరి, పాఠశాల చైర్మన్ శైలజ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. పెద్దలు లెంక రాంబాబు, బొద్దపు బంగార్రాజు, లోకి రెడ్డి అచ్చిబాబు, కోరుకొండ మూర్తి, గొంతిన స్వామినాయుడు, కోరుకొండ కృష్ణ, కోరుకొండ శివ తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. దేశభక్తి, క్రమశిక్షణ, విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యమని వక్తలు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.