Thursday, 10 September 2026
  • Home  
  • వీరనారి చాకలి ఐలమ్మకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకుల ఘన నివాళి
- పెద్దపల్లి

వీరనారి చాకలి ఐలమ్మకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకుల ఘన నివాళి

పెద్దపల్లి, సెప్టెంబర్ 10: తెలంగాణ సాయుధ పోరాట వీరనారి, బహుజన విప్లవ ప్రతీక చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మెరుగు చందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మెరుగు చందర్ యాదవ్ మాట్లాడుతూ… నైజాం రజాకార్లు, భూస్వాముల అరాచకాలకు ఎదురొడ్డి, తన భూమి కోసం, హక్కుల కోసం వీరోచితంగా పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. బహుజనుల హక్కుల సాధన కోసం, ఆత్మగౌరవం కోసం ఐలమ్మ పోరాడిన తీరు నేటి తరానికి ఎంతో ఆదర్శనీయమని పేర్కొన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్లప్పుడూ ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బహుజనుల, పేద ప్రజల హక్కులకై ముందుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మెరుగు చందర్ యాదవ్ జిల్లా ఉపాధ్యక్షుడు మేరుగు సతీష్ గౌడ్, జిల్లా సంయుక్త కార్యదర్శి కంపెల్లి స్వామి, జిల్లా కార్యదర్శి కుమ్మరి పరమేష్, పెద్దపల్లి మండల అధ్యక్షులు వెంగళ కృష్ణ నాయకుడు, గోగు సురేష్, సోషల్ మీడియా జిల్లా సెల్ ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

పెద్దపల్లి, సెప్టెంబర్ 10:
తెలంగాణ సాయుధ పోరాట వీరనారి, బహుజన విప్లవ ప్రతీక చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మెరుగు చందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మెరుగు చందర్ యాదవ్ మాట్లాడుతూ… నైజాం రజాకార్లు, భూస్వాముల అరాచకాలకు ఎదురొడ్డి, తన భూమి కోసం, హక్కుల కోసం వీరోచితంగా పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. బహుజనుల హక్కుల సాధన కోసం, ఆత్మగౌరవం కోసం ఐలమ్మ పోరాడిన తీరు నేటి తరానికి ఎంతో ఆదర్శనీయమని పేర్కొన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్లప్పుడూ ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బహుజనుల, పేద ప్రజల హక్కులకై ముందుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మెరుగు చందర్ యాదవ్ జిల్లా ఉపాధ్యక్షుడు మేరుగు సతీష్ గౌడ్, జిల్లా సంయుక్త కార్యదర్శి కంపెల్లి స్వామి, జిల్లా కార్యదర్శి కుమ్మరి పరమేష్, పెద్దపల్లి మండల అధ్యక్షులు వెంగళ కృష్ణ నాయకుడు, గోగు సురేష్, సోషల్ మీడియా జిల్లా సెల్ ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.