Monday, 14 September 2026
  • Home  
  • వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలి
- తిరుపతి

వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలి

– వినాయక కమిటీ సభ్యులకు పోలీసు అధికారుల సూచనలు చిట్వేల్: వినాయక చవితి పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో కోడూరు రూరల్ సీఐ డి. శ్రీనివాసులు, చిట్వేల్ ఎస్‌ఐ ఎస్. వినోద్‌కుమార్ మండలంలోని సిద్ధారెడ్డిపల్లి, వెంకటరాజపురం గ్రామాల్లో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని వినాయక కమిటీ సభ్యులతో సమావేశాలు నిర్వహించారు. పండుగను ప్రజలందరూ సంతోషంగా, భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. విగ్రహ నిమజ్జనం సమయంలో పోలీసుల సూచనలు, భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ఊరేగింపులను ప్రశాంతంగా నిర్వహిస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కమిటీ సభ్యులు, ప్రజలు పోలీసులకు సహకరిస్తూ పరస్పర సమన్వయంతో పండుగను శాంతియుతంగా నిర్వహించాలని పోలీసు అధికారులు సూచించారు.

– వినాయక కమిటీ సభ్యులకు పోలీసు అధికారుల సూచనలు

చిట్వేల్: వినాయక చవితి పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో కోడూరు రూరల్ సీఐ డి. శ్రీనివాసులు, చిట్వేల్ ఎస్‌ఐ ఎస్. వినోద్‌కుమార్ మండలంలోని సిద్ధారెడ్డిపల్లి, వెంకటరాజపురం గ్రామాల్లో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని వినాయక కమిటీ సభ్యులతో సమావేశాలు నిర్వహించారు. పండుగను ప్రజలందరూ సంతోషంగా, భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. విగ్రహ నిమజ్జనం సమయంలో పోలీసుల సూచనలు, భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ఊరేగింపులను ప్రశాంతంగా నిర్వహిస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కమిటీ సభ్యులు, ప్రజలు పోలీసులకు సహకరిస్తూ పరస్పర సమన్వయంతో పండుగను శాంతియుతంగా నిర్వహించాలని పోలీసు అధికారులు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.