విద్యార్థులు పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ప్రముఖ వైద్యురాలు డాక్టర్ మంజూష సలాది తెలిపారు. బుధవారం పిఠాపురం పట్టణంలో గల ప్రభుత్వ శాఖా గ్రంధాలయాన్ని సందర్శించి నిరుద్యోగులు కు ఉపయోగపడే 35పుస్తకాలను సుమారు 15 వేల రూపాయలు విలువగల స్టడీ మెటీరియల్ ను గ్రంధాలయం లో పాఠకుల ఉపయోగార్ధం వినియోగించాలని గ్రంధాలయ అధికారి ఆర్. వెంకట రాము కు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గ్రూప్ వన్, గ్రూప్ టూ డీఎస్సీ, తదితర పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను కాంపిటీటివ్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని గ్రంథాలయ అధికారిని కోరారు. అనంతరం శాఖా గ్రంధాలయంలో ఉన్న వివిధ పుస్తకాలను పరిశీలించారు. పిఠాపురం పట్టణానికి చెందిన ఎం.ఎస్ హాస్పిటల్ అధినేత డాక్టర్. జి. సురేష్ బాబు ఆధ్వర్యంలో సుమన్వి హెల్త్ కేర్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రంథాలయంలో చదువుకుంటున్న విద్యార్థులను చూసి ఆమె సంతృప్తి వ్యక్తం చేస్తూ విద్యార్థులు చిన్నతనం నుండి పుస్తక పఠనం ద్వారా ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని, సెల్ ఫోన్ కు బానిస కాకుండా గ్రంథ పఠనం ద్వారావిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని విద్యార్థులకు హితవు పలికారు.ఈ కార్యక్రమంలో మెప్మా సిటీ మిషన్ మేనేజర్ శ్రీమతి వెంకటలక్ష్మి,వివిధ పాఠశాల విద్యార్థులు, నిరుద్యోగ యువత గ్రంథాలయ పాఠకులు తదితరులు పాల్గొన్నారు.

