Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రోటోవేటర్ అమర్చుతుండగా విషాదం.. యువ రైతు మృతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రోటోవేటర్ అమర్చుతుండగా విషాదం.. యువ రైతు మృతి

వార్త ముఖ్యాంశాలు

  • కలిగిరి, నవంబరు: వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన ఓ యువకుడు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు.
  • ఈ ఘటన మండలంలోని నాగసముద్రం పంచాయతీ బీసీ కాలనీలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం..
  • పల్లాపు నవీన్ (26) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

కలిగిరి, నవంబరు: వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన ఓ యువకుడు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మండలంలోని నాగసముద్రం పంచాయతీ బీసీ కాలనీలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం.. పల్లాపు నవీన్ (26) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తన ట్రాక్టర్‌కు రోటోవేటర్‌ను అమర్చే ప్రయత్నం చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నవీన్ మృతిచెందాడు.ఘటనపై ఎస్ఐ లతీఫున్నీసా కేసు నమోదు చేశారు. బుధవారం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆత్మకూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఆమె వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *