Thursday, 9 July 2026
  • Home  
  • రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలి: మొగిలి నాగరాజు పిలుపు
- ఖమ్మం

రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలి: మొగిలి నాగరాజు పిలుపు

రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలి: మొగిలి నాగరాజు పిలుపు జులై 09 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొననున్న రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఏన్కూరు మండల ఓబీసీ కాంగ్రెస్ అధ్యక్షుడు మొగిలి నాగరాజు పిలుపునిచ్చారు.మండలంలోని ప్రతి గ్రామం నుంచి రైతులు, కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో సభకు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వ్యవసాయాభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కీలక అంశాలను ప్రస్తావించే అవకాశం ఉన్నందున రైతులు ఈ సభను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.రైతు ఆశీర్వాద సభ విజయవంతం కావడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత అని పేర్కొన్న మొగిలి నాగరాజు, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేసి రైతులను, ప్రజలను పెద్ద ఎత్తున సభకు తరలించాలని విజ్ఞప్తి చేశారు.

రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలి: మొగిలి నాగరాజు పిలుపు

జులై 09 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్

ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొననున్న రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఏన్కూరు మండల ఓబీసీ కాంగ్రెస్ అధ్యక్షుడు మొగిలి నాగరాజు పిలుపునిచ్చారు.మండలంలోని ప్రతి గ్రామం నుంచి రైతులు, కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో సభకు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వ్యవసాయాభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కీలక అంశాలను ప్రస్తావించే అవకాశం ఉన్నందున రైతులు ఈ సభను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.రైతు ఆశీర్వాద సభ విజయవంతం కావడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత అని పేర్కొన్న మొగిలి నాగరాజు, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేసి రైతులను, ప్రజలను పెద్ద ఎత్తున సభకు తరలించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.