Thursday, 1 October 2026
  • Home  
  • రేణిగుంటలో నెలరోజులు నిషేధాజ్ఞలు.. సెక్షన్‌ 30 అమలు
- తిరుపతి

రేణిగుంటలో నెలరోజులు నిషేధాజ్ఞలు.. సెక్షన్‌ 30 అమలు

రైల్వేకోడూరు నుంచి పెనగలూరు వరకు సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌ అమలు అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసుల ముందస్తు చర్యలు తిరుపతి : రేణిగుంట సబ్‌ డివిజన్‌ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్‌. సుబ్బారాయుడు ఐపీఎస్‌ ఆదేశాల మేరకు అక్టోబర్‌ 1 నుంచి 31వ తేదీ వరకు సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌కు సంబంధించిన నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు తెలిపారు. ఈ నిషేధాజ్ఞలు రేణిగుంట సబ్‌ డివిజన్‌ పరిధిలోని రైల్వేకోడూరు, పుల్లంపేట, ఓబులవారిపల్లి, చిట్వేల్, పెనగలూరు మండలాల్లో అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు తలెత్తకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్న సమయంలో సంబంధిత పోలీసుల అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదని సూచించారు. ప్రజలు చట్టపరమైన నిబంధనలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని డీఎస్పీ కోరారు. ప్రజల భద్రత, ప్రశాంత వాతావరణ పరిరక్షణే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు.

రైల్వేకోడూరు నుంచి పెనగలూరు వరకు సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌ అమలు

అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసుల ముందస్తు చర్యలు

తిరుపతి : రేణిగుంట సబ్‌ డివిజన్‌ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్‌. సుబ్బారాయుడు ఐపీఎస్‌ ఆదేశాల మేరకు అక్టోబర్‌ 1 నుంచి 31వ తేదీ వరకు సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌కు సంబంధించిన నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు తెలిపారు. ఈ నిషేధాజ్ఞలు రేణిగుంట సబ్‌ డివిజన్‌ పరిధిలోని రైల్వేకోడూరు, పుల్లంపేట, ఓబులవారిపల్లి, చిట్వేల్, పెనగలూరు మండలాల్లో అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు తలెత్తకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్న సమయంలో సంబంధిత పోలీసుల అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదని సూచించారు. ప్రజలు చట్టపరమైన నిబంధనలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని డీఎస్పీ కోరారు. ప్రజల భద్రత, ప్రశాంత వాతావరణ పరిరక్షణే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.