*వెల్వడం గ్రామ అభివృద్ధే లక్ష్యంగా వై ఎస్ ఆర్ సి పి పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా తోట తిరుమల*
పున్నమి న్యూస్ ప్రతినిధి మైలవరం/ ఎన్టీఆర్ జిల్లా/ నవంబర్ 13*
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండలం వెల్వడం గ్రామంలో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మాజీ ఏఎంసీ డైరెక్టర్ తోట తిరుపతిరావు భార్య తోట తిరుమల ఎన్నికల బరిలో నిలిచారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ప్రజల మద్దతుతో ముందుకు సాగుతున్నారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పన, తాగునీటి సమస్య పరిష్కారం, సీసీ రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్యం వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే తన లక్ష్యమని తెలిపారు. గ్రామ ప్రజల ఆశీస్సులు, ఆదరణతో అవకాశం కల్పిస్తే వెల్వడం గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని తోట తిరుమల పేర్కొన్నారు వెల్వడం గ్రామ అభివృద్ధే లక్ష్యం.సర్పంచ్ అభ్యర్థిగా తోట తిరుమల

