మైలవరం గడ్డపై మళ్లీ వసంత ప్రభంజనం..!
స్థానిక సమరంలో కూటమి క్లీన్‌స్వీప్.
వైసీపీకి కోలుకోలేని ఎదురుదెబ్బ!
ఎంపీటీసీ ఎన్నికల్లో 59 స్థానాలకు 50 కూటమి ఖాతాలోకి.. వైసీపీకి దక్కింది కేవలం 9 స్థానాలే!
ఐదు జెడ్పీటీసీ స్థానాల్లోనూ టీడీపీ బలపరిచిన అభ్యర్థుల ఘన విజయం.. భారీ మెజార్టీలతో ప్రత్యర్థులకు షాక్!
కొండపల్లి మున్సిపల్ ఎన్నికల విజయోత్సాహం.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే జోరు!
మైలవరం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మరోసారి స్పష్టమయ్యాయి. ప్రజా తీర్పులో కూటమి బలం ఏమిటో, నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసం ఏమిటో తాజా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు చాటిచెప్పాయి. ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం, విజయవాడ రూరల్ మండలాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయభేరి మోగించి ప్రత్యర్థి వైసీపీకి గట్టి షాక్ ఇచ్చారు.
59లో 50.. కూటమి విజయదుందుభి!
మైలవరం నియోజకవర్గంలో ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం మండలాల్లో మొత్తం 59 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా, కూటమి బలపరిచిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులు ఏకంగా 50 స్థానాలను కైవసం చేసుకున్నారు. వైసీపీ అభ్యర్థులు కేవలం 9 స్థానాలకే పరిమితమయ్యారు. ఈ ఫలితాలు నియోజకవర్గంలో కూటమికి ఉన్న ప్రజాదరణను ప్రతిబింబించాయి.
నాలుగుకు నాలుగు.. జెడ్పీటీసీల్లోనూ తిరుగులేని ఆధిపత్యం!
నాలుగు జెడ్పీటీసీ స్థానాల్లోనూ తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు భారీ మెజార్టీలతో విజయం సాధించడం కూటమి శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు రెండింటిలోనూ కూటమి ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది.
కొండపల్లి నుంచి స్థానిక సమరం వరకు.. విజయాల పరంపర!
ఇటీవల కొండపల్లి మున్సిపల్ ఎన్నికల్లో 40 వార్డులకు గాను 30 వార్డులను కైవసం చేసుకుని, చైర్‌పర్సన్ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలుచుకున్న కూటమి, తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తన విజయ పరంపరను కొనసాగించింది. ఒకదాని వెంట ఒకటిగా వస్తున్న విజయాలు వైసీపీ శ్రేణులకు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బగా మారాయి.
విజయవాడ రూరల్‌లోనూ కూటమి జోరు!
విజయవాడ రూరల్ మండలంలోనూ తెలుగుదేశం, కూటమి అభ్యర్థులు తమ విజయ పరంపరను కొనసాగించి రాజకీయంగా తమ పట్టును చాటుకున్నారు.
వసంత నాయకత్వానికి మరోసారి ప్రజామోదం!
మైలవరం నియోజకవర్గంలో కూటమి విజయాల వెనుక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారి నాయకత్వం, కూటమి పార్టీల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తల సమష్టి కృషి కీలకంగా నిలిచాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి ఎన్నికల ప్రచారం వరకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగిన కూటమి, ప్రజల మద్దతుతో విజయాలను సొంతం చేసుకుంది.
మున్సిపల్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు మైలవరం రాజకీయాల్లో వసంత నాయకత్వానికి ఉన్న బలాన్ని మరోసారి చాటిచెప్పాయి. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూటమి విజయోత్సాహం, వసంత అభిమానుల సంబరాలు కనిపిస్తున్నాయి.
మైలవరం గడ్డ.. వసంత అడ్డా!
విజయాల పరంపర.. వసంత నాయకత్వానికి ప్రజా నీరాజనం!!
ప్రజా తీర్పు ఒక్కటే.. మైలవరం గడ్డపై వసంత హవా కొనసాగుత

