Monday, 1 June 2026
  • Home  
  • మూసివేసిన బాణాసంచా కేంద్రాలు తెరవాలి : సిపిఎం డిమాండ్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మూసివేసిన బాణాసంచా కేంద్రాలు తెరవాలి : సిపిఎం డిమాండ్

నిబంధనల పేరుతో నెల్లూరులో అధికారులు మూసివేయించిన బాణాసంచా తయారీ కేంద్రాలను తెరిపించి కార్మికులను వెంటనే ఆదుకోవాలని సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ సెల్ లో బాధితులతో కలిసి జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పదిమంది లైసెన్సుడు బాణసంచా తయారీ దారులు ఉన్నారని, వారి వద్ద వందమంది వరకు కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు. గత నాలుగు నెలల నుండి వివిధ కారణాలు చెప్పి అధికారులు తయారీ కేంద్రాలను మూసి వేయించడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. ఇప్పటికన్నా జిల్లా అధికారులు నిబంధనలకు అనుగుణంగా ఉన్న షాపుల నిర్వహణకు వెంటనే అనుమతులు ఇచ్చి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బాణాసంచా తయారీ కేంద్రాల యజమానులు శివ, అబ్బయ్య, సుబ్రహ్మణ్యం, రాజా మరియు కార్మికులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.