Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బొగ్గేరుకు ఇసుకాసురుల తూట్లు.. యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బొగ్గేరుకు ఇసుకాసురుల తూట్లు.. యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు!

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మకూరు: ఆత్మకూరు, మర్రిపాడు, ఏఎస్‌పేట మండలాల్లో అక్రమ ఇసుక తవ్వకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
  • రాత్రి, పగలు తేడా లేకుండా టిప్పర్లు, పొక్లెయిన్లతో ఇసుకను తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.నాగులపాడు–కోటపాడు గ్రామాల మధ్య ప్రవహించే బొగ్గేరులో అక్రమ తవ్వకాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.
  • ఈ వాగుపై ఆధారపడి సుమారు 25 గ్రామాల ప్రజలు వ్యవసాయం, తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నారు.

ఆత్మకూరు: ఆత్మకూరు, మర్రిపాడు, ఏఎస్‌పేట మండలాల్లో అక్రమ ఇసుక తవ్వకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా టిప్పర్లు, పొక్లెయిన్లతో ఇసుకను తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.నాగులపాడు–కోటపాడు గ్రామాల మధ్య ప్రవహించే బొగ్గేరులో అక్రమ తవ్వకాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వాగుపై ఆధారపడి సుమారు 25 గ్రామాల ప్రజలు వ్యవసాయం, తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. అయితే ఇసుక తవ్వకాల కారణంగా భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోర్లలో నీరు తగ్గడంతో సాగుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు.మరోవైపు ఏఎస్‌పేట మండలంలోని బీరాపేరు,నక్కలవాగుల్లోనూ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాకర్లపాడు, పందిపాడు పరిసర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టి, వాగులను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *