బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌లో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఐసీయూలో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఐదుగురు రోగులు మరణించారు. మరికొందరు గాయపడి సమీప ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో 24 మంది రోగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది సుమారు 15 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసి, మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

బీహార్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం – ఐదుగురు మృతి