బిజినపల్లి: మండల బీసీ సంఘం నాయకులు ఆదివారం స్థానిక సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) శంషదీన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంఘం మండల అధ్యక్షుడు వేముల సత్యశీలసాగర్, కమిటీ చైర్మన్ అంతటి రాజేందర్ గౌడ్, గౌరవ అధ్యక్షుడు దాసర్ల వెంకటస్వామి ఎస్సైకి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మండలంలోని పలు అంశాలపై ఆయనతో చర్చించారు. శాంతిభద్రతల పరిరక్షణకు తమ వంతు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు



